News February 8, 2025

KNR: రేషన్ కార్డు దరఖాస్తులు.. అయోమయంలో ప్రజలు!

image

కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు మీ సేవలో శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రజా పాలన గ్రామసభలు దరఖాస్తులు ఇచ్చిన లబ్ధిదారులు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు ఇవ్వాలా? లేదా? అనే అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌కు శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారల్లో సాధారణ సెలవు ఉంటుందని తిరిగి మార్కెట్‌ సోమవారం ప్రారంభం అవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 19 వాహనాల్లో 144 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,450, కనిష్ఠంగా రూ.6,800 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.100 పెరిగింది.

News December 18, 2025

KNR: ఎన్నికల పరిశీలకులకు అభినందనలు: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల పరిశీలకులు వి. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఎన్నికల విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి ఫలితమే విజయవంతమైన ఎన్నికల నిర్వహణ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారు.

News December 18, 2025

ఒక్క ఓటుతో శ్రీరాములపల్లి సర్పంచ్‌గా రమ్య

image

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుత్తికొండ రమ్య ఒక్క ఓటుతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి BRS అభ్యర్థి తిప్పరబోయిన శారదపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.