News November 29, 2024
KNR: రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి: కలెక్టర్
విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కృషి భవనంలో ఇన్ పుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లమా కోర్సు శిక్షణ తరగతులను ప్రారంభించారు. 40 మంది డీలర్లకు సంవత్సరం పాటు వారానికి ఒకరోజు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News December 8, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వెల్గటూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రామగుండంలో ప్రైవేట్ విద్యాలయం ప్రిన్సిపల్ పై దాడి. @ తంగళ్ళపల్లి మండలంలో మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో మాజీ ఎంపీపీ భర్త మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్‌తో మేకలు, గొర్రెలు మృతి. @ మెట్పల్లిలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులు.
News December 8, 2024
సైలెంట్ కిల్లర్ కాదు.. నా శైలిలో ముందుకెళ్తున్నా: శ్రీధర్ బాబు
ఐటీ మంత్రిగా తనకు ఎవరితో పోలిక లేదని, తనదైన శైలిలో ముందుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ ఐటీ మంత్రి కంటే మెరుగ్గా పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, తనదైన శైలిలో కృషి చేస్తానని అన్నారు. తమకున్న వనరులతోనే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే తాను సైలెంట్ కిల్లర్ కాదని పనిలో నిమగ్నమవుతానని స్పష్టం చేశారు.
News December 8, 2024
వేములవాడ కోడెల విక్రయం అవాస్తవం: మంత్రి కొండా సురేఖ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రసారమవుతున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.