News August 5, 2024
KNR: లక్ష్యం చేరని పంట రుణాలు
నాలుగేళ్లుగా పంట రుణాలు 72శాతానికి మించటం లేదు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో 12.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా. ఈ మేరకు 2024-25 వార్షికానికి కరీంనగర్ జిల్లాకు రూ.2,357.80, జగిత్యాల రూ.2,292.60, పెద్దపల్లి రూ.1,864.83, సిరిసిల్ల రూ.1,519.03 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు KNR 1750.12, JGTL 1520.30, PDPL 1250.40, SRCL 982.01 కోట్ల రుణాలు మంజూరు చేశారు.
Similar News
News September 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళోజి జయంతి. @ ధర్మారం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ముస్తాబాద్ మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ తంగళ్ళపల్లి మండలంలో విద్యుత్ షాక్ కు గురైన విద్యార్థిని. @ జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ల దరఖాస్తులకు గడువు పెంపు. @ గురుకులాలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన సిరిసిల్ల కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణికి 96 ఫిర్యాదులు.
News September 9, 2024
జగిత్యాల: తొమ్మిది మంది ఎమ్మార్వోల బదిలీ
జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కథలాపూర్ ఎమ్మార్వోగా వి.వినోద్, పెగడపల్లి MROగా రవీందర్ నియామకమయ్యారు. ఆర్.శ్రీనివాస్ మెట్పల్లికి, కథలపూర్‌లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ అయ్యారు. ఏ.శ్రీనివాస్ జగిత్యాల రూరల్, సి.రామ్మోహన్ జగిత్యాల అర్బన్‌కు బదిలీ చేశారు. వరందన్ సారంగాపూర్, రమేష్ కొడిమ్యాలకు బదిలీ అయ్యారు.
News September 9, 2024
శృంగేరి పీఠానికి బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ ఎమ్మెల్యే , ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి శృంగేరి పీఠానికి బయలుదేరారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు శృంగేరి పీఠాధిపతుల అనుమతులు పొందడానికి వెళ్లినట్టు తెలిపారు. వివిధ నిర్మాణాల నమూనాలు, నిర్మాణ ప్రాంతాల ఫొటోలతో పీఠాధిపతులకు వివరించనున్నారు.