News March 23, 2024
KNR: వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మానకొండూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దూరుపల్లికి చెందిన పంది జగన్(51)కు రెండెకరాల సాగు భూమి ఉంది. అందులో ఆడ-మగ వరి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పుద్దు దులుపుతుండగా.. ఎండ వేడి వల్ల జగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం KNR ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.
Similar News
News April 18, 2026
మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన ‘షీ లీడ్స్’ సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసులు వృత్తిపరంగా, సామాజికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు, భరోసా కేంద్రాల పనితీరును కొనియాడారు. అనంతరం మహిళా సిబ్బందికి స్కూటీలు, రక్షణ సామగ్రిని పంపిణీ చేశారు.
News April 17, 2026
KNR: పాడి పశువుల పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025 -26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న 2 పాడి పశువుల దరఖాస్తు గడువు పొడిగించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని ఫోటో, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంకు పాస్ బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
News April 17, 2026
కరీంనగర్: టీటీసీసీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTCC) కోర్సుకు ఈనెల 18 నుంచి 29 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని, SSCతో పాటు సంబంధిత ట్రేడ్‌లో టీసీసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దరఖాస్తులు ఈ నెల 29లోపు డీఈవో ఆఫీసులో అందజేయాలన్నారు.


