News March 20, 2025
KNR: విద్యార్థి దశలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాస్థాయి యువజన ఉత్సవం కార్యక్రమం తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలో స్వేచ్ఛ, అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ దశలోనే చదువుతోపాటు సమాజసేవను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందించడం కూడా ముఖ్యమైన్నారు.
Similar News
News March 21, 2025
HZB: కాకతీయ కెనాల్ కాలువలో మృతదేహం

హుజూరాబాద్ మండలం తుమ్మపల్లి కాకతీయ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 21, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.9°C నమోదు కాగా, శంకరపట్నం 37.8, కరీంనగర్ రూరల్ 37.6, జమ్మికుంట 37.5, గన్నేరువరం 36.8, చొప్పదండి, మానకొండూర్ 36.6, రామడుగు 36.5, చిగురుమామిడి 36.4, వీణవంక 36.3, తిమ్మాపూర్ 36.1, కరీంనగర్ 36.0, కొత్తపల్లి 35.2, ఇల్లందకుంట 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.0°C గా నమోదైంది.
News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.