News March 29, 2024

KNR: విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. హెడ్ మాస్టర్ సస్పెండ్

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు గైర్హాజరైన గన్నేరువరం మండలం హనుమాజిపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మిని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు సస్పెండ్ చేశారు. విధులకు ఆలస్యంగా హాజరైన మరో ఇద్దరు ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైన సిబ్బంది వివరాలు తమ దృష్టికి తీసుకువస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 11, 2026

హుజురాబాద్‌లో 81.47% పోలింగ్ నమోదు

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.

News February 11, 2026

కరీంనగర్: ‘అభ్యర్థి సస్పెన్షన్ వార్తల్లో నిజం లేదు’

image

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.

News February 11, 2026

హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

image

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.