News January 30, 2025
KNR: విలీన గ్రామాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

కరీంనగర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక అధికారులతో బుధవారం సందర్శించారు. ఈ సంధర్బంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. విలీన గ్రామపంచాయతిలలో నియమించిన ప్రత్యేక అధికారులు అన్ని రికార్డులను ప్రొఫార్మా ప్రకారం తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిపారు. విలీన గ్రామాలకు నగరపాలక సంస్థ వార్డుగా బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ నంబర్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా నంబర్ 7993744287లో సంప్రదించాలని తెలిపారు.
News February 13, 2025
చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
News February 13, 2025
KNR: ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలన్నారు.