News October 11, 2024
KNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
KNR, JTYL, PDPL,SRCL జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Similar News
News November 11, 2024
రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాత్రి 11:55గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.
News November 10, 2024
మెట్‌పల్లి ఎమ్మెల్యేగా జ్యోతి నియంతృత్వ పాలనను ఎదిరించారు: MLC
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియంతృత్వ పాలనను ఎదురించడంలో ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తమతో పాటు ఎమ్మెల్యేగా జ్యోతి ముందు వరుసలో ఉండేదని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనసభలోనే కాకుండా అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం జ్యోతి పోరాటం చేసారన్నారు.
News November 10, 2024
సీఎం, మంత్రి వెంకట్ రెడ్డిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.