News March 12, 2025

KNR: సీలింగ్ ఫ్యాన్ పడి విద్యార్థినికి గాయాలు

image

పరీక్ష రాస్తుండగా విద్యార్థినిపై ఫ్యాన్ పడి గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ నగరంలోని సహస్ర జూనియర్ కాలేజీలో జరిగింది. నీలి శివాన్విత అనే ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని పరీక్ష రాస్తోంది. ఈక్రమంలో సీలింగ్ ఫ్యాన్ ఆమె తలపై పడడంతో గాయాలయ్యాయి. నిర్వాహకులు ప్రథమ చికిత్స చేసి ఎగ్జామ్ రాయించారు. 

Similar News

News December 2, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.