News August 12, 2024
KNR: స్థానిక ఎన్నికలపై గ్రామాల్లో చర్చ?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలపై ప్రతి గ్రామంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,400 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసి 6 నెలలు గడిచినప్పటికీ ఎన్నికలు జరగకపోవడంతో పల్లెలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. అయితే రిజర్వేషన్లు కొనసాగిస్తారా లేక మారుస్తారా? అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆశావహులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 27, 2024
సోలార్ విద్యుత్ పొదుపునకు వినూత్న ఆవిష్కరణ
సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యలలో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ విద్యుత్ను వృథాగా పోనీయకుండా బ్యాటరీలో నిల్వ చేసే ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ ను పైలెట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేస్తోందని సంస్థ C&MD బలరాం ప్రకటనలో తెలిపారు.
News November 27, 2024
కరీంనగర్ రీజియన్లో 104 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్లో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
ఇబ్రహీంపట్నం: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.