News February 23, 2026

KNR: అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్పంచ్‌ల పెత్తనం..!

image

గ్రామస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచ్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ 777, పెద్దపల్లి 706, జగిత్యాల 1065, సిరిసిల్ల 587 కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, నాణ్యతను పరిశీలించేందుకు సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలు కొలువుదీరనున్నాయి.

Similar News

News February 25, 2026

నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

image

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

image

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

image

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.