News September 22, 2025
KNR: అమ్మవారి దీక్ష తీసుకున్న కేంద్రమంత్రి బండి

దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా KNR శ్రీ మహాశక్తి దేవాలయంలో KNR MP, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం అమ్మవారి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆయన మాలధారణ చేశారు. కాగా, దీక్ష స్వీకరించిన రోజునుంచి నవరాత్రులు ముగిసే వరకు ఆయన మహాశక్తి ఆలయంలోనే ఉంటారు. ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ దుర్గమ్మ సేవలో తరిస్తారు. ఈ 9 రోజులపాటు ఏ రాజకీయ కార్యక్రమాల్లో MP పాల్గొనరు.
Similar News
News September 22, 2025
NZB: ‘భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి’

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు.
News September 22, 2025
రంపచోడవరం: గ్రీవెన్స్‌లో 98 అర్జీలు

రంపచోడవరం ITDA కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 98 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. PO. స్మరణ్ రాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నిటిని అక్కడే పరిష్కరించారు. మిగిలినవి సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారని పేర్కొన్నారు. ప్రతీ అర్జీని బాధ్యతయుతంగా పరిష్కరించాలని PO ఆదేశించారు.
News September 22, 2025
పెద్దపల్లి: ‘పండుగ భద్రతా ఏర్పాట్లు పూర్తి’

బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు, ప్రజల భద్రతకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌తోపాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అనుమానాస్పద వ్యక్తులపై, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.