News October 1, 2025

KNR: అమ్మవారి పల్లకి మోసిన బండి సంజయ్

image

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన పల్లకి సేవ కార్యక్రమంలో కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం ఆలయ అర్చకులు పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి దీక్షలో ఉన్న కేంద్రమంత్రి బండి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీనులైన పల్లకిని మోశారు. ఆలయ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Similar News

News October 23, 2025

కరీంనగర్: సిటిజన్ సర్వేకు ప్రజల స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం గతవారం ప్రారంభించిన సర్వే ఈ నెల 25న ముగుస్తుంది. వెబ్సైట్‌ను సందర్శించి సలహాలు సూచనలు తెలపాలని కలెక్టర్ సూచించారు.

News October 23, 2025

కరీంనగర్: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: సీపీ

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. ‘ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర’, ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశాలపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ఈ లింకులో ఈనెల 28 వరకు అప్లోడ్ చేయాలన్నారు. ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు.

News October 23, 2025

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

image

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. DCC అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.