News July 8, 2025
KNR: అర్బన్ మెడికల్ ఆఫీసర్ల పోస్టుకు దరఖాస్తులు

కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింద 3 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరతున్నట్లు DMHO డా.వెంకట రమణ తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జీతం నెలకు- రూ. 52,000లు. అర్హత: MBBS, ఆఖరి తేదీ- ఈనెల 10లోపు DMHOలో దరఖాస్తులను స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు karimnagar.telangana.gov.inను చూడవచ్చు.
Similar News
News September 10, 2025
KNR: ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ: కలెక్టర్

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు.
News September 9, 2025
KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
News September 9, 2025
KNR: ఈనెల 11 నుంచి IFWJ జాతీయ సమావేశాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈనెల 11- 13 తేదీల్లో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాల్లో డిజిటల్ జర్నలిజం, జర్నలిస్టుల రక్షణ, పెన్షన్ స్కీం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని KNR జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి కుడుతాడు బాపురావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమంతో సమావేశాలు ప్రారంభమవుతాయి