News November 11, 2025

KNR: అర్హత లేనివారికి కొలువులు.. జీతాలు..!

image

2024- DSC టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా SGT పోస్టుల నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఇటీవల రీవెరిఫికేషన్‌కు ఆదేశించింది. విచారణలో 22మంది అనర్హులని తేలింది. విద్యా, స్పోర్ట్స్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అర్హత లేనివారు కొలువు చేస్తున్నారు. నివేదికను బయటపెడితే అక్రమార్కుల జాబ్స్ తీసేయాల్సి వస్తుందనే నెపంతో ఈ ఫైల్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Similar News

News November 11, 2025

MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 11, 2025

‘తుఫాను బాధితులకు తక్షణమే పరిహారం అందించాలి’

image

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలు, రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. తుఫాను వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారికి మేలు చేయాలని కోరారు.

News November 11, 2025

ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

image

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్‌ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్‌తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?