News December 21, 2025

KNR: ఆదిలోనే అడ్డంకి.. నిరాశ కలిగిస్తున్న ఫెర్టిలైజర్ యాప్

image

రైతులకు ఎరువుల లభ్యత, నిల్వలు, ధరల వివరాలను వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘Fertilizer’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభంలోనే మొరాయించింది. యాప్ ఓపెన్ చేయగానే “ఈ యాప్ తాత్కాలికంగా నిలిపివేయబడింది” అనే సందేశం కనిపిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలు కాగితాల మీద పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడేలా ఉండాలని ఉమ్మడి KNR రైతులు కోరుకుంటున్నారు.

Similar News

News December 25, 2025

వ్యాధుల ముప్పు కోళ్లలో తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.

News December 25, 2025

హుజూర్‌నగర్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

image

క్రిస్మస్ సందర్భంగా హుజూర్‌నగర్ పట్టణంలోని పలు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎస్సీలు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ సర్టిఫికెట్, రిజర్వేషన్లు కోల్పోతారన్న అభిప్రాయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

News December 25, 2025

పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు

image

పెట్రోలియం జెల్లీని సాధారణంగా కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. * పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని చర్మంపై రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుంది. * చిట్లిన వెంట్రుకలకు తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. * మీ ఇంట్లో పెంపుడు జంతువుల పాదాలకు రోజూ కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే అవి సురక్షితంగా ఉంటాయి.