News December 31, 2025

KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Similar News

News January 3, 2026

పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

image

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యంను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టల్ శాఖ అకౌంట్‌లో జమ చేయకపోవడంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోస్టల్ శాఖ రూ.3.5 లక్షల అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేసింది.

News January 2, 2026

శాతవాహన అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా ఎస్ రమాకాంత్

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో డాక్టర్ ఎస్.రమాకాంత్‌ పీజీ & ప్రొఫెషనల్ పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమకయ్యరు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టర్ ఉత్తర్వులు అందజేశారు. రమాకాంత్ ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.

News January 2, 2026

KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.