News April 16, 2024
KNR: ఆన్ లైన్‌లో రాములవారి తలంబ్రాలు

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.
Similar News
News April 23, 2025
చొప్పదండి: మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో టెస్టులు చేయించుకోవాలని.. తద్వారా రుగ్మతలు నివారించుకోవచ్చన్నారు.
News April 23, 2025
కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, మానకొండూర్ మండలాల్లో 44.0°C నమోదు కాగా, కొత్తపల్లి, చొప్పదండి 43.8, కరీంనగర్, జమ్మికుంట 43.7, శంకరపట్నం 43.6, రామడుగు, ఇల్లందకుంట, తిమ్మాపూర్ 43.5, వీణవంక 43.4, గన్నేరువరం, కరీంనగర్ రూరల్ 43.3, చిగురుమామిడి 43.1, సైదాపూర్ 42.8, హుజూరాబాద్ 42.2°C గా నమోదైంది.
News April 23, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మే 5 నుంచి మగ్గం వర్క్స్, మే 8 నుంచి టైలరింగ్ పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ 31 రోజులు ఉంటుందని అన్నారు.