News March 20, 2025

KNR: ఆహార నాణ్యతపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ హాస్టళ్లు, హోటల్లు ఆహార తయారు చేసే కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం ఆమె సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. నాసిరకమైన ఆహారం తయారు చేయడం పట్ల కఠినచర్యలు తీసుకోవాలన్నారు. వాటికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 31, 2025

KNR: SRR కళాశాలలో ఉపన్యాస కార్యక్రమం

image

KNR SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డిగ్రీ, PG విద్యార్థులకు లైకెన్లపై విస్తృత ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. లైకెన్ల ఆవిర్భావం, లైకెన్ల ప్రాముఖ్యత, అవి కాలుష్య సూచికలగా ఎలా ఉపయోగపడతాయో శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

News October 31, 2025

కరీంనగర్ జిల్లాలో 34వేల ఎకరాల్లో పంట నష్టం

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 183 గ్రామాల్లో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వీటిలో 30,565 ఎకరాల్లో వరి, 3,512 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో మక్కపంటలు దెబ్బతిన్నాయి. HZB డివిజన్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. అధికారులు పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

News October 31, 2025

కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

image

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.