News August 24, 2025

KNR: ఇప్పటికైనా వీటికి పరిష్కారం పక్కానా..?

image

KNR(D) గంగాధర మం.లో ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నేతలు నేడు పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి KNR జిల్లాలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలెన్నో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, దర్మపురి, తదితర ఆలయాల అభివృద్ధి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్, KNR- JGTL రోడ్డు విస్తరణ, నారయణపూర్ భూనిర్వాసితుల సమస్యతోపాటు ఎన్నో అపరిష్కృత ఇబ్బందులను తీర్చాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుతున్నారు.

Similar News

News August 24, 2025

కర్నూలు: కవల పిల్లలకు టీచర్ ఉద్యోగాలు

image

గూడూరుకు చెందిన వడ్ల రామాంజనేయులు, సరస్వతి దంపతుల కుమారులు(కవలలు) రవితేజ ఆచారి, విష్ణు వర్ధన ఆచారి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలు పొందారు. రవితేజ ఆచారి 83 మార్కులు, విష్ణు వర్ధన ఆచారి 82 మార్కులు సాధించారు. తమ కుమారులు ఎస్జీటీ విభాగంలో ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు వారిని అభినందించారు.

News August 24, 2025

KNR: 4 గంటలకు రెండో విడత జనహిత పాదయాత్ర

image

గంగాధర మండలం ఉప్పర మల్యాలలో కాంగ్రెస్ పార్టీ రెండో విడత జనహిత పాదయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఉప్పర మల్యాలలో పాదయాత్ర ప్రారంభమై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. మధురానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.

News August 24, 2025

airtel ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు

image

airtel మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ చేసుకోవడానికి నెట్‌వర్క్ పని చేస్తున్నా నెట్ వాడేందుకు వీలు కావట్లేదంటున్నారు. చాట్ చేసేందుకూ ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కొందరు మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నారు. దీనిపై airtel స్పందించాల్సి ఉంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.