News June 26, 2024

KNR: ఈ నెల 29న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

image

ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో‌ ఉన్నారు. ఇందులో భాగంగానే‌ ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.

Similar News

News June 29, 2024

స్వచ్ఛ కరీంనగర్‌గా తీర్చిదిద్దుదాం: ప్రఫుల్ దేశాయ్

image

కరీంనగర్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, (మున్సిపల్ కమీషనర్) ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మన ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.

News June 29, 2024

KNR: విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్

image

ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 మంది విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96.76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.

News June 29, 2024

సిరిసిల్ల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్‌లో గల ఈవీఎం గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేసి అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డిఓ రమేష్, తహసీల్దార్ షరీఫ్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.