News September 4, 2025
KNR: ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్స్ యోగా పోటీలు

అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు తెలిపారు. 8-18 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు బెర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఈ నెల 6న ఉ.9 గం.కు కోచ్లు వద్ద నమోదు చేసుకోవాలన్నారు. 8985275068 సంప్రదించాలన్నారు
Similar News
News September 4, 2025
KNR: గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: సీపీ

కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలలో బందోబస్తు, రూఫ్ టాప్, పుషింగ్ పార్టీ, స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.
News September 4, 2025
KNR: ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ క్యాంపు

KNR నగరంలోని భగత్ నగర్ లో విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అకాడమీ సీనియర్ కోచ్ శివయ్య తెలిపారు. ఈ క్యాంపునకు ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వివరాలకు 7569229294, 9030177607 సంప్రదించాలన్నారు.
News September 4, 2025
KNR: విద్యుత్ సమస్యలపై ఫిర్యాదుకు వాట్సప్ చాట్ బాట్

విద్యుత్తు వినియోగదారుల కోసం TGNPDCL వాట్సప్ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని KNR ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్ వాట్సాప్లో 7901628348 నంబరుకు ‘హాయ్’ అని మెస్సేజ్ పంపగానే వెల్కమ్ టూ TGNPDCL కాల్ సెంటర్ అని సందేశం అందుతుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకొని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి IVRL కాల్ వస్తుందన్నారు.