News October 7, 2025
KNR: ఈ NUMBER SAVE చేసుకోండి..!

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఉమ్మడి KNRలో ఆశావహులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో సదరు నేతపై ఫిర్యాదు చేసేందుకు HYDలోని ఈసీ కార్యాలయంలో అధికారులు CALL సెంటర్ (9240021456)ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులే కాకుండా ఎన్నికల సమాచారం, ఓటర్ లిస్ట్ వివరాలను ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చు. మరి పైనంబర్ SAVE చేసుకోండి. మీకూ ఉపయోగపడవచ్చు.
Similar News
News March 5, 2026
సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.
News March 5, 2026
చాట్ GPTకి షాక్.. 25 లక్షల మంది యూజర్లు ఔట్!

చాట్ GPTకి యూజర్లు షాకిచ్చారు. 25 లక్షల మంది దాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ శాఖలో ఏఐ మోడల్స్ వినియోగానికి OpenAI ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో AI వినియోగానికి మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేసుకుంటున్నారు. బాయ్‌కాట్ చేస్తామని వెబ్‌సైట్(https://quitgpt.org/)లో సంతకాలు చేస్తున్నారు.
News March 5, 2026
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.


