News August 10, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. రేపే చివరి తేదీ

KNR జిల్లా BC స్టడీ సర్కిల్లో గ్రూప్- 1, 2, 3, 4, RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే(ఆగస్ట్ 11) చివరి తేదీ అని డైరెక్టర్ డా.మంతెన రవికుమార్ తెలిపారు. అర్హులైన జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరగతులు ఆగస్ట్ 25 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Similar News
News August 10, 2025
APL: 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ సంచలనం నమోదు చేశారు. కాకినాడ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో 17 బంతుల్లోనే ఫిఫ్టీ బాదారు. 19 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 రన్స్ చేశారు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జహీర్, తేజ(46*) విధ్వంసంతో విజయవాడ 195 పరుగులు చేసింది. కాకినాడ పరుగుల వేటలో పడింది.
News August 10, 2025
అలంపూర్ ఆలయ అర్చకులకు నోటీసులు

దేవాదాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గాను జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. ఈ నెల 6న డోన్‌లో ఒక రాజకీయ నాయకుడి ప్రైవేట్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారని, ఇది SMలో వైరల్ కావడంతో దేవాదాయశాఖ సీరియస్‌గా స్పందించిందని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
News August 10, 2025
రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

రేపు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.