News November 10, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

KNR జిల్లా తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ” పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు NOV 12 వరకు పొడిగించినట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు NOV 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 10, 2025

సంగారెడ్డి: టీచర్లను సర్దు బాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని పేర్కొన్నారు.

News November 10, 2025

భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> నోయిడా 10 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, డిప్లొమా, MD, MS, DNB, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్‌కు రూ.2.22లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.47లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.27లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News November 10, 2025

మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

image

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.