News January 11, 2026

KNR: ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IELTS ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ అని డైరెక్టర్ డా.రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసినవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 040-24071178, 0878-2268686 నంబర్లను సంప్రదించవచ్చు.

Similar News

News February 26, 2026

ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

image

గర్భిణులు, బాలింతలకీ అదనపు పోషకాలు తప్పనిసరి. ఈ ఆహారమే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, ఇమ్యునిటీని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28 రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌ D, కాల్షియం అవసరం, విటమిన్‌ A, అయొడిన్‌లు శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

News February 26, 2026

BREAKING: ఉమ్మడి వరంగల్‌లో భారీగా IASల బదిలీలు

image

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. చాహత్ బాజ్ పాయ్‌ను హనుమకొండ కలెక్టర్‌‌గా నియమించిన ప్రభుత్వం.. GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జనగామ కలెక్టర్‌ రిజ్వాన్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝాను, ఏటూరునాగారం ITDA పీవో చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా గణేశ్‌ను నియమించారు.

News February 26, 2026

పోలవరం: ఆవులపై దాడి చేసిన పెద్దపులి?

image

పోలవరం జిల్లాలో పులి సంచారం కలవర పెడుతోంది. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రజలకు పులి తారస పడడంతో బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.