News January 1, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా వణికించిన చలి తీవ్రత గురువారం కాస్త తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాల వారీగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: జగిత్యాల జిల్లా కొల్వాయి, రాఘవపేటలో 12.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 13.0, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 13.7, కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 14.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

Similar News

News January 2, 2026

వ్యాపారస్తులకు ఉద్యమ్ సర్టిఫికెట్ తప్పనిసరి- PO

image

గిరిజన ప్రాంతంలో వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమల నిర్వాహకులు తప్పనిసరిగా ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ కావాలని ఐటిడిఏ పీఓ స్మరన్ రాజ్ అన్నారు. శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏలో అన్ని మండలాల వెలుగు ఏపీఎంలతో పీఓ సమావేశం నిర్వహించారు. ప్రతి వ్యాపారస్తులు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కావాలని అధికారులకు పీవో సూచించారు. ఉద్యమ్ సర్టిఫికెట్ వల్ల వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగంటుందని పీఓ అన్నారు.

News January 2, 2026

BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

image

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.

News January 2, 2026

అరకు: ఆస్పత్రి బాత్రూంలో మహిళ డెలివరీ

image

అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రుంలో శుక్రవారం గుర్తు తెలియని శిశువు మృతదేహం ఉండటం కలకలం రేగింది. బాత్రూంలో గురువారం రాత్రి గుర్తుతెలియని మహిళ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చి, అనంతరం ఎవరికి తెలియకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది శుక్రవారం ఉదయం బాత్రూంలో నవజాత శిశువు ఉన్నట్లు గుర్తించారు. CC ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.