News January 14, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుతూ వస్తోంది. బుధవారం ఉదయం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2℃, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 14.5℃గా నమోదయ్యాయి.

Similar News

News February 17, 2026

HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

image

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్‌సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్‌టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!

నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

image

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.