News February 6, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో ‘మున్సిపల్’ పోరు

ఉమ్మడి KNR జిల్లాలో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్సిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. తాము చేపట్టిన పనులను ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని BRS ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్ర నిధులతో పట్టణాల రూపురేఖలు మారుస్తామని BJP హామీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
Similar News
News February 6, 2026
ప్రేమ-పాశం: తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

ఈ మధ్య భార్యలు/ వారి ప్రియుళ్ల చేతిలో భర్తల చావు ఘటనలు చాలా వింటున్నాం. వీటిలో తప్పు.. పెళ్లి తర్వాతా గత రిలేషన్‌లో ఉండే అమ్మాయిలదా? లవ్ మ్యాటర్ చెప్పినా బలవంతంగా మరొకరితో వివాహం చేస్తున్న పెద్దలదా? ప్రేమ పెళ్లితో పరువు పోతుందనే పేరెంట్స్.. మన అమ్మాయి వల్లే అల్లుడు చనిపోతే పరువు పోదా? ఇక Love Birds.. ప్రేమ తప్పదంటే త్యాగాన్నైనా కోరుతుంది. అది ప్రాణత్యాగం మాత్రం కాదు.. అవతలి ప్రాణం అస్సలే కాదు.
News February 6, 2026
నెల్లూరులో ఆ రైతు ఐడియా అదుర్స్..!

నెల్లూరు జిల్లాలో వరి కోతకు వస్తోంది. చాలా చోట్ల వడ్ల గింజలను పిట్టలను తినేస్తున్నాయి. రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమంలో సంగం మండలం అనసూయ నగర్‌కు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. ఛార్జింగ్‌తో పనిచేసే మైక్ సెట్ పొలాల్లో ఏర్పాటు చేశారు. అందులో నుంచి శబ్దాలు రావడంతో పక్షులు అటు వైపు రావడం లేదు. ఓసారి ఛార్జింగ్ పెట్టి పొలాల్లో పెడితే సాయంత్రం వరకు పనిచేస్తోంది.
News February 6, 2026
GWL: ఉచిత ఫౌండేషన్ కోర్సు శిక్షణ గడువు పొడిగింపు

MBNR ఎస్సీ స్టడీ సర్కిల్లో స్టేట్ సర్వీసెస్, బ్యాంకింగ్, RRB ఉద్యోగాలకు ఇచ్చే 5 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు శిక్షణకు నిరుద్యోగుల నుంచి స్వీకరించే దరఖాస్తుల గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత శుక్రవారం తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారీటీ గ్రాడ్యుయేట్స్ tsstudycircle.com.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


