News September 19, 2025

KNR: ఎంగిలిపూల, పెద్ద బతుకమ్మ, దసరా.. తేదీలివే..!

image

పితృ అమావాస్య, ఎంగిలిపూల(చిన్న) బతుకమ్మ ఈనెల 21న ఆదివారం ప్రారంభమవుతుందని కరీంనగర్లోని ప్రధాన వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈనెల 22 సోమవారం నుంచి శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయని, 29 సోమవారం సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2 గురువారం విజయదశమి, దసరా పండుగను జరుపుకోవాలని సూచించారు.

Similar News

News September 19, 2025

సంగారెడ్డి: చేతులు బంధించుకుని ధర్నా చేసిన న్యాయవాదులు

image

నాంపల్లి, నాగర్ కర్నూల్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి తమ చేతులను బిగించుకుని కోర్టు మందు శుక్రవారం ధర్నా చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

సంగారెడ్డి: ‘న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురండి’

image

న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. న్యాయవాదుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

News September 19, 2025

ANU: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. ఈనెల 21వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు.