News October 26, 2025
KNR: ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిపై సీఈఆర్‌సీ సమీక్ష

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు వీ.రమేష్‌బాబు శనివారం సందర్శించారు. ఎన్టీపీసీ రామగుండం ఈడి చందన్ కుమార్ సమంత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు వద్ద నూతనంగా నిర్మించిన సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ భవనాన్ని వారు ప్రారంభించారు. ప్రాజెక్ట్‌లోని స్విచ్‌యార్డ్‌ను సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తిపై సమీక్షించారు.
Similar News
News October 26, 2025
జూబ్లీహిల్స్ బరిలో పాలమూరు బిడ్డ అస్మా

మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిర్మలాపూర్‌కు చెందిన షేక్ హుస్సేన్, సాబేర బేగం కుమార్తె అస్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఎం.ఏ. తెలుగు పూర్తి చేసిన ఆమె గతంలో నిరుద్యోగుల తరఫున పోరాటం చేశారు. అస్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపింది.
News October 26, 2025
NGKL: మద్యం టెండర్లతో జిల్లాకు రూ.450.04 కోట్ల ఆదాయం

నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రూ.450 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చింది. జిల్లాలోని 67 దుకాణాలకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయడంతో ఈ ఆదాయం సమకూరింది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 500కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News October 26, 2025
భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.


