News October 16, 2025

KNR: ఎల్లుండే LAST.. టెన్షన్‌లో ఎక్సైజ్ శాఖ..!

image

మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. 2024తో పోలిస్తే ఈసారి ఆశించిన మేర టెండర్లు రాకపోవడంతో ఆబ్కారీ శాఖ టెన్షన్ పడుతోంది. అయితే గతేడాది చివరిరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అలాంటి పరిస్థితే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటిదాకా KNRలో 94 WINESకు 233, PDPLలో 74కి 136, SRCLలో 48కి 226, JGTLలో 71కి 286 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News October 16, 2025

బీసీ రిజర్వేషన్లు 50% దాటొచ్చనే తీర్పు లేదు: ప్రతివాదుల లాయర్

image

TG: బీసీ రిజర్వేషన్లపై ప్రతివాదుల తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్‌నారాయణన్ వాదనలు వినిపిస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే రిజర్వేషన్ల పరిమితి 50% దాటిందన్నారు. అక్కడ SC, STలకే రిజర్వేషన్లు వర్తించాయని, BCల కోసం 50% పరిమితి దాటొచ్చనే తీర్పు లేదని వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 50% పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని గతంలో SC తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షితో భేటీ కీలకం కానుంది.

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.