News April 1, 2024
KNR: ఏప్రిల్5న ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పర్యటన: ఎమ్మెల్యే గంగుల
ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ నివాసంలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురి నాయకులతో గంగుల సమావేశం నిర్వహించారు.
Similar News
News January 13, 2025
KNR: పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. వీటిని ఎందుకు పోస్తారో తెలుసా..? రేగు పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు. వీటికి అర్కఫలం అనే పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. వీటిని ఐదేళ్ల లోపు పిల్లల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.
News January 13, 2025
జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం: పెద్దపల్లి ఎమ్మెల్యే
ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
News January 13, 2025
కోనరావుపేట: చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి
కోనరావుపేట మండలం ఓ గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మహిళ భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.