News September 15, 2025
KNR: ఒకే వేదికపై కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, MP

MNCL రైల్వే స్టేషన్‌లో <<17713840>>వందే భారత్ రైలు<<>>కు అదనపు స్టాప్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, MP వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కీలక నేతలు వేదికపై నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఎప్పుడు ఉప్పునిప్పుల్లా ఉండే ఇరుపార్టీల నాయకులు ప్రొటోకాల్ సమయంలో మాత్రం ఇలా హుందాగా వ్యవహరించడం మంచి పరిణామమని అంటున్నారు. మీ COMMENT.
Similar News
News September 15, 2025
సీఎం రేవంత్ వద్దకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంచాయతీ!

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ పంచాయితీ సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ విషయమై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి సమావేశ సారాంశం, కాలేజీ యాజమాన్యాల డిమాండ్లను మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేసే ఆస్కారముందని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.
News September 15, 2025
ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

ములుగులోని ప్రేమ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న తిప్పనపల్లి శాంతకుమార్ గా గుర్తించారు. రెండు బైకులు ఢీకొవడంతో శాంతకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్‌బాట్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్‌బాట్‌లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్‌తో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చాయి.