News September 21, 2025
KNR: ఒక్కోమహిళకు రూ.50వేలు.. రూ.లక్ష స్కూటీ!

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వ్యాపారాల కోసం ఒక్కోమహిళ రూ.50,000 పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని KNR మైనారిటీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. అలాగే రేవంతన్న కా సహారా స్కీంలో భాగంగా అందించే రూ.లక్ష విలువగల మోపెడ్(స్కూటీ) వాహనాలు పొందేందుకు tgobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో APPLY చేసుకోవాలన్నారు. ఇందుకు చివరితేదీ OCT 6 అని, మరిన్ని వివరాలకు 0878-2957085ను సంప్రదించాలన్నారు. #SHARE IT.
Similar News

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.
News September 21, 2025
వరంగల్: పండగ పూట పంచాయతీ కార్యదర్శుల పరేషాన్..!

పండుగ పూట బతుకమ్మ ఏర్పాట్లు చేయడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్యదర్శులు వాపోయారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో సర్పంచులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే పెట్టిన డబ్బులకు బిల్లులు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు ఇక్కట్లు తప్పడం లేదని అన్నారు.