News May 13, 2024

KNR: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. KNR ఎంపీ స్థానంలో 2019లో 69.52 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లిలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

Similar News

News January 21, 2025

ఈనెల 24న కరీంనగర్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్

image

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ పట్టణంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్‌ను పరిశీలించారు.

News January 21, 2025

AI టెక్నాలజీని వేగవంతం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

సాంబానోవా సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చినందుకు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. AI మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో అత్యాధునిక AI టెక్నాలజీని వేగవంతం చేస్తామన్నారు.

News January 21, 2025

ఇచ్చిన మాట ప్రకారం నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం

image

సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.