News November 17, 2025
KNR: ఓపెన్ స్కూల్ సొసైటీలో భారీ SCAM

ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో రూ.కోటి వరకు కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం వచ్చిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉండగా.. ఒక్కో స్టడీ సెంటర్‌కు రూ.30వేల వరకు నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇంతకుముందు కో- ఆర్డినేటర్‌గా పనిచేసిన ఉద్యోగికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News November 17, 2025
రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.