News December 9, 2025
KNR: కట్టింది రెండు గోడలే.. రూ.కోట్లు కొట్టేశారు..!

మానేరు రివర్ ఫ్రంట్‌లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పనులు అవ్వకుండానే కాంట్రాక్టర్‌కు రూ.192CR బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలొస్తున్నాయి. BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.545 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు మానేరుకు ఇరువైపులా కేవలం 2 రిటైనింగ్ వాల్స్ మాత్రమే కట్టారు.
Similar News
News March 3, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.
News March 3, 2026
తూ.గో: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. లోపల 36 మంది..!

నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
News March 3, 2026
UAEలో ‘ప్యానిక్ బయ్యింగ్’.. ప్రభుత్వం భరోసా!

ఇరాన్ దాడుల నేపథ్యంలో UAEలో నీటి కొరత ఏర్పడొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనం సూపర్ మార్కెట్లకు పోటెత్తడంతో నిత్యావసరాలు, బాటిల్ వాటర్ షెల్ఫ్స్ ఖాళీ అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా నిలిచిపోతుందనే అనుమానాలే ఈ ‘ప్యానిక్ బయ్యింగ్’కు దారితీశాయి. అయితే దేశంలో 3నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని UAE ప్రభుత్వం భరోసా ఇచ్చింది.


