News October 19, 2025

KNR: కర్తవ్య భవన్‌లోకి మారిన బండి సంజయ్ ఆఫీస్

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన శాఖ కార్యాలయంను కర్తవ్య భవన్‌లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ-డెవలెప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన కామన్ సెంట్రల్ సచివాలయాన్ని ప్రధాని AUG 6న ప్రారంభించారు. కాగా, దీపావళిని పురస్కరించుకొని నేడు మంచి మహూర్తం ఉండటంతో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ కర్తవ్య భవన్‌లోకి మంత్రి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు చేసి తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.

Similar News

News October 19, 2025

సంగారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలందరూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని, అయితే టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News October 19, 2025

CM సాబ్.. తోడా హాత్ మిలావోనా!

image

సదర్ సమ్మేళన్‌లో CM రేవంత్ రెడ్డి యువతలో జోష్ నింపారు. ఓ వైపు యాదవుల బలగం, మరోవైపు దున్నరాజుల విన్యాసాలు వీక్షించేందుకు NTR స్టేడియానికి వేలాది సంఖ్యలో యువకులు తరలివచ్చారు. అంతటి రద్దీలోనూ CMను చూసిన కొందరు ఆయన్ను చరవాణిలో బంధించేందుకు, చేయి కలిపేందుకు ఆసక్తి చూపించారు. వేదిక అలంకరించబోయే ముందు యువతను చూసిన CM స్వయంగా వారి వద్దకు వెళ్లారు. సెక్యూరిటీని పక్కనబెట్టి సింప్లిసిటీని చాటారు.

News October 19, 2025

దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

image

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.