News November 21, 2025
KNR: ‘కళాశాలల్లో ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి’

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ, PG ప్రభుత్వ, ప్రైవేటు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, సెక్రటరీస్, కరస్పాండెంట్లు, ఇన్‌ఛార్జిలతో SU ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో VC ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అన్ని కళాశాలల్లో విద్యార్థులకు ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని అన్నారు.
Similar News
News November 22, 2025
తిరుపతి: వారికి ధరల పెంపు

తిరుపతి జిల్లాలోని 2,283 స్కూళ్లలో 3,472మంది మధ్యాహ్న భోజనం తయారీ చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనం రూ.3వేలు ఇస్తారు. అలాగే ఒక్కో విద్యార్థికి(1 నుంచి 5వతరగతి) రూ.5.45, 6 నుంచి ఇంటర్ విద్యార్థులకు రూ.8.17 చొప్పున డబ్బులు ఇస్తారు. వీటితో కూరగాయలు, వంట నూనె, పప్పులు కొనుగోలు చేస్తారు. ఈ నగదు సరిపోవడం లేదని వంటవాళ్లు అంటున్నారు. దీంతో ప్రభుత్వం రూ.5.45 నుంచి రూ.6.19కి, రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచింది.
News November 22, 2025
ఎర్రచందనం పరిరక్షణకు నిధుల విడుదల

ఎర్రచందన చెట్ల సంరక్షణపై నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర అటవీ శాఖకు ₹38.36 కోట్లు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డుకు రూ.1.48 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే ఎర్రచందనం వేలంతో రాష్ట్ర ప్రభుత్వానికి ₹87.68 కోట్లు వచ్చాయి. అదనంగా AP బయోడైవర్సిటీ బోర్డు ద్వారా లక్ష ఎర్రచందనం మొక్కల పెంపకానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు.
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


