News February 12, 2025

KNR: కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

image

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

image

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్‌ 30 పోలీసు చట్టంను నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News November 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 12, 2025

మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

image

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.