News October 28, 2025
KNR: కీచక అటెండర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

KNR జిల్లా గంగాధర(M) కురిక్యాల ZPHSలోని బాలికల బాత్రూంలో అటెండర్ కెమెరా అమర్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో అటెండర్ యాకుబ్ పాషాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అటెండర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీనిపై MLA సత్యం, కేంద్రమంత్రి బండి, మాజీ MLA రవిశంకర్ స్పందించారు. ప్రతిపక్షాలూ గంగాధర ప్రధాన చౌరస్తాలో బైఠాయించాయి.
Similar News
News October 28, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

భగవద్గీత మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం, వినయవంతులు ఔన్నత్యం కోసం భగవద్గీతను చదవాలి. మోక్షం కోరేవారు, అశాంతిగా ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవితం కోసం గీతను అధ్యయనం చేయాలి.
News October 28, 2025
ఏలూరు: అధికారులకు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు

తుఫాను పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పొంగుతున్న వాగుల వద్ద ప్రమాద స్థాయిని గుర్తించి, వెంటనే గండ్లు కొట్టి, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.
News October 28, 2025
పెద్దపల్లి కలెక్టర్‌ను కలిసిన నూతన ఎంపీడీవోలు

గ్రూప్-1 నియామకాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్‌కు చెందిన కంకణాల శ్రీజ రెడ్డి (509 ర్యాంకు) మంథని ఎంపీడీవోగా, జగిత్యాలకు చెందిన వేముల సుమలత (609వ ర్యాంకు) అంతర్గాం ఎంపీడీవోగా, కరీంనగర్‌కు చెందిన సాదినేని ప్రియాంక (446వ ర్యాంకు) కమాన్‌పూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.


