News August 18, 2025
KNR: కోటగిరి గట్ల వైభవం.. నేటికీ సజీవం!

KNR జిల్లా సైదాపూర్ మం. సర్వాయిపేట కోటగిరి గట్లలోని చారిత్రక కట్టడాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. కొత్త, పాత ఖిల్లాలు, బలిష్టమైన రాతిగోడలు, రహస్య సొరంగాలు, బయ్యన్న విగ్రహం, చెరువులు, ఆలయాలు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను చాటుతున్నాయి. కోనేర్లు, కందకాలు, హనుమాన్, శివాలయాలు, ఎల్లమ్మగుడి నిర్మాణాలు ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పాపన్న నిర్మించిన బయ్యన్న, సర్వమ్మ, ఎల్లమ్మ చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.
Similar News
News August 18, 2025
NZB: రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.
News August 18, 2025
VJA: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 57 ఫిర్యాదులు

విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
News August 18, 2025
NZB: యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

వ్యవసాయ అవసరాల కోసం కేటాయిస్తున్న యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. సోమవారం వారు రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.