News September 15, 2025
KNR: గుడ్ న్యూస్.. వారంలో 5 రోజులు తిరుపతికి రైళ్లు

ఉమ్మడి కరీంనగర్ ప్రయాణికులకు వారంలో ఐదు రోజులపాటు తిరుపతికి వెళ్లేందుకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. KNR నుంచి తిరుపతికి ఆది, గురువారాల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మంగళవారం నాందేడ్ నుంచి తిరుచానూర్‌కు వీక్లీ స్పెషల్ రైలు తిరుపతి మీదుగా నడవనున్నాయి. శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం, శనివారం నాందేడ్ నుంచి తిరుపతి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు KNR, PDPL, జమ్మికుంట స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.
Similar News
News September 15, 2025
జగిత్యాల బిడ్డకు ‘మిస్ చికాగో’ కిరీటం

న్యూజెర్సీలో ఈ నెల 12న నిర్వహించిన విశ్వసుందరి అందాల పోటీల్లో ‘మిసెస్ చికాగో యూనివర్స్- 2026’ టైటిల్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బొజ్జ సౌమ్యవాసు గెలుచుకున్నారు. అమెరికాలో స్థిరపడి, ప్రస్తుతం ఓ బహుళ జాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, సామాజిక కార్యకర్తగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్య ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు.
News September 15, 2025
NGKL: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతగా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News September 15, 2025
రాంనగర్‌లో మృత్యు నాలాలు!

భారీ వర్షం వస్తే ప్రాణాలు పోతున్నాయి. వరద ఉద్ధృతికి నాలా ప్రహరీలు పేక మేడళ్ల కూలిపోతున్నాయి. ఇది ఎప్పుడో ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు. ముషీరాబాద్, రాంనగర్‌లో ప్రతి ఏడాది ఇదే తంతు. నిన్న వినోభానగర్‌లో యువకుడు సన్నీ గల్లంతు ఆందోళనకు దారి తీసింది. అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొన్నారని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదని, గాలింపు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.