News February 28, 2025
KNR: గ్రాడ్యుయేట్స్ 64.64 శాతం, టీచర్స్ 89.92 శాతం

కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 46,247 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64.64 ఓట్ల శాతం నమోదైంది. అలాగే ఉపాధ్యాయ ఎన్నికలో 46,247 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ 89.92 శాతం నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
Similar News
News February 28, 2025
కరీంనగర్: విషాదం.. ఒకే రోజు ముగ్గురు

శంకరపట్నం(M) కేశవపట్నంలో ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. గ్రామానికి చెందిన తన్నీరు రాంబాబు అనారోగ్యంతో మృతి చెందగా, వివిధ కారణాలతో కల్లేపల్లి పోచమ్మ, గొల్లిపెల్లి కనకయ్య మృతి చెందారు. ఒకేరోజు ముగ్గురు మృతిచెందగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో కూడా ఇలాంటి వరుస మరణాలు సంభవించడంతో ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు అనే కొత్త నానుడి ఏర్పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
News February 28, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పోలింగ్ శాతం వివరాలు

జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గురువారం జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం వివరాలు. జగిత్యాల జిల్లాలో పట్టభద్రులు 70.47%, టీచర్స్ 92.43% ఓటు వినియోగించుకోగా.. పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రులు 68.50%, టీచర్స్ 94.42%, కరీంనగర్ జిల్లాలో పట్టభద్రులు 64.64%, టీచర్స్ 89.92%, సిరిసిల్లలో పట్టభద్రులు 68.73%, టీచర్స్ 94.63% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 27, 2025
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

కరీంనగర్ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్‌లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.