News January 14, 2026

KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

image

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.

Similar News

News February 16, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

News February 16, 2026

కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

News February 15, 2026

KNR: ‘కమిషనరేట్‌’ పరిధిలో ఆంక్షలు.. 144 సెక్షన్‌ అమలు

image

కరీంనగర్ MCK పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.