News October 25, 2025
KNR: జీవన్‌రెడ్డిని పక్కన పెట్టారా.? పార్టీలో చర్చ

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతున్నట్లుగా ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. డా.సంజయ్‌ని పార్టీలో చేర్చుకునే ముందు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి, లైట్ తీసుకుంటున్నారనే వాదన ఉంది. తన శిష్యుడైన మంత్రి లక్ష్మణ్ వద్ద భవిష్యత్ గురించి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. క్యాడర్ కూడా సంజయ్ వెంట ఉండటంతో జీవన్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
Similar News
News October 26, 2025
‘డ్రై డే’ పాటిద్దాం.. అంటువ్యాధులను అరికడదాం: వైద్యాధికారి

అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ సూచించారు. శనివారం ఆయన బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టిక, ఫార్మసీ గది, ల్యాబ్ తీరును పరిశీలించారు. దోమ కాటు ద్వారా సంభవిస్తున్న మలేరియా, డెంగ్యూ నివారణ కోసం ‘డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.
News October 26, 2025
VH ట్రోఫీలో RO-KO ఆడతారా? గిల్ ఏమన్నారంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత కెప్టెన్ గిల్ తెలిపారు. SAతో ODI సిరీస్ అనంతరం సెలక్టర్లు దీనిపై RO-KOతో చర్చిస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లందరూ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అగర్కర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రోహిత్, కోహ్లీని VH ట్రోఫీలో ఆడాలని సూచించే అవకాశముంది.
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.


