News September 3, 2025

KNR: టీచర్స్ డే.. ఉత్తమ టీచర్లకు అవార్డులు..!

image

SEPT 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 సెలవు దినం కావడంతో వేడుకలను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి పురస్కారాలను అందజేయనున్నారు. 43 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

Similar News

News September 4, 2025

నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి

image

KNRలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఇందులో భాగంగా మానకొండూరు చెరువును, చింతకుంట చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గణేష్ విగ్రహాల తరలింపు సమయంలో కరెంటు తీగలు, చెట్లు అడ్డు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు.

News September 4, 2025

KNR: గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: సీపీ

image

కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలలో బందోబస్తు, రూఫ్ టాప్, పుషింగ్ పార్టీ, స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.

News September 4, 2025

KNR: ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ క్యాంపు

image

KNR నగరంలోని భగత్ నగర్ లో విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అకాడమీ సీనియర్ కోచ్ శివయ్య తెలిపారు. ఈ క్యాంపునకు ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వివరాలకు 7569229294, 9030177607 సంప్రదించాలన్నారు.