News September 24, 2025

KNR: ట్రాఫిక్ రూల్స్ BREAK చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్త వాట్సప్ నంబర్‌ను తెచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గమనిస్తే, వాటిని టైమ్ స్టాంప్ కెమెరాతో ఫొటో తీసి 9381919112 నంబర్‌కు వాట్సప్ చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాంగ్ రూట్‌, త్రిబుల్ రైడింగ్, రోడ్డుకు అడ్డంగా పార్క్ చేయడం లాంటి ఉల్లంఘనలను తమ దృష్టికి తేవాలన్నారు.

Similar News

News September 24, 2025

KNR: ‘కాలుష్యంతో అల్లాడుతున్నాం.. పట్టించుకోండి సార్లూ’

image

KNR కార్పొరేషన్ ప్రజలు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతూ అల్లాడుతున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై వారు ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు. రూ.16 కోట్లతో బయో మైనింగ్ సిస్టంతో చెత్త తొలగింపు ప్రక్రియ చేపట్టినా అది సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కాగా, సమస్యకు పరిష్కారం చూపడంలో స్థానిక నేతలకు చిత్తశుద్ధి లేదనే విమర్శలున్నాయి. యార్డ్‌ను మరోచోటకు తరలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News September 23, 2025

KNR: హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్

image

వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

News September 23, 2025

KNR: బాల సదన్, శిశు గృహాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

image

పట్టణంలోని బాల సదన్, శిశు గ్రహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కే.వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు. శిశు గృహాలలోని వంట, ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శిశు గృహ లోని పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలని కోరారు.