News January 5, 2026
KNR: ‘ట్రేడ్ లైసెన్స్ లేకుండా అక్రమ వ్యాపారం’

ఉమ్మడి జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారులు అక్రమంగా కోట్లు సంపాదించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే టాక్స్ మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయం. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అధికారులను మేనేజ్ చేస్తూ పన్నుల చెల్లింపును ఎగ్గొడుతున్నారు. ఫలితంగా ఏటా రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది.
Similar News
News January 6, 2026
VHT: డబుల్ సెంచరీ చేసిన హైదరాబాద్ ప్లేయర్

విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌తో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు విధ్వంసం సృష్టించారు. 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ నమోదు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్ గహ్లాట్ రాహుల్(65) ఫిఫ్టీతో రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 352 రన్స్ చేసింది. కాగా ఈ సీజన్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు స్వస్తిక్(216) ద్విశతకం బాదారు.
News January 6, 2026
హిల్ట్ పాలసీ ఉద్దేశమిదే: మంత్రి శ్రీధర్ బాబు

TG: హిల్ట్ <<18765759>>పాలసీ<<>>తో HYD నగర ప్రజలను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికవేత్తల భూములు ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు. హిల్ట్ పాలసీ కింద 6 నెలలు గడువు ఇస్తామని, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామన్నారు. ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ అనేది రాబోయే తరాల కోసం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది అని ఆయన చెప్పారు.
News January 6, 2026
గురుకుల ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు: జయశ్రీ

టీజీ సెట్ 2026 ద్వారా గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ జయశ్రీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈనెల 21 లోపు దరఖాస్తులకు చివరి గడువు అని పేర్కొన్నారు.


